- Step 1
ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకుని రవ్వ వేసి 5 నిమిషాలు పచ్చి వాసనా పోయే వరకు వేయించి, వేరే గిన్నెలోకి పోసుకుని పక్కన పెట్టుకోండి.
- Step 2
అదే కడాయిలో నూనె పోసి ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర, కరివేపాకు, వేరుశెనగ విత్తులు వేసి వేయించుకోవాలి.
- Step 3
తరువాత అల్లం, పచ్చి మిర్చి వేసి వేగాక క్యారెట్ ముక్కలు, పచ్చి బఠాణి వేసి కొంచెం ఉప్పు చల్లి మూత పెట్టి తక్కువ మంట మీద 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
- Step 4
తరువాత టమాటా ముక్కలు, కొత్తిమీర కూడా వేసి మరో 5 నిమిషాలు ఉంచి దానిలో నీరు పోసి, ఉప్పు కూడా వేసుకుని మరగనివ్వాలి.
- Step 5
నీరు బాగా మరిగి పొంగు వస్తున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని నీటిలో వేస్తూ తిప్పుకోవాలి. స్టవ్ మంట తగ్గించి రవ్వని బాగా ఉండలు లేకుండా కలయబెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
- Step 6
చివరగా కొత్తిమీర , నిమ్మరసం వేసుకుని కలుపుకుని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. కారం పొడిలో నెయ్యి వేసుకుని తింటే ఉప్మా చాలా రుచిగా ఉంటుంది.