- Step 1
ముందుగా మినపప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి 6 గంటలు నీటిలో నానబెట్టుకోవాలి.
- Step 2
తరువాత నీరు వడకట్టి మిక్సీ జార్ లో కొంచెం కొంచెం నీరు పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 3
ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక రాత్రి లేదా పగలు అంతా ఉంచితే పులుస్తోంది.
- Step 4
ఇలా పులిసిన పిండి రుచిగా ఉంటుంది. చల్లని ప్రదేశాలలో ఉండే వారు ఒవేన్ కొంచెం వేడి అయ్యాక ఆఫ్ చేసి ,స్టీల్ గిన్నెలో పిండిని పెట్టి ఒవేన్ లో ఉంచితే ఆ వేడికి పిండి పులుస్తోంది.
- Step 5
అలా పులిసిన పిండిలో ఉప్పు వేసి, నీరు కొద్దీ కొద్దీగా కలుపుకుంటూ జారుగా చేసుకోవాలి. తరువాత దోశల పాన్ తీసుకుని బాగా వేడి అయ్యాక ఒక గుంట గరటలో పిండి తీసుకుని పాన్ మీద వేసి గుండ్రంగా దోస ఆకారం వచ్చేలా వేగంగా తిప్పుకోవాలి.
- Step 6
దోస వేసేటప్పు కావాలి అంటే స్టవ్ మంట తగ్గించుకుని తర్వాత పెంచుకోవచ్చు. తరువాత నూనె వేసుకుని దోరగా దోశని రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకుని పల్లీ చట్నీ లేదా ఉల్లి చట్నీ తో తినటమే.