- Step 1
ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, కొంచెం ఉప్పు, నూనె వేసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి 3 నిమిషాలు మగ్గనిచ్చి, దానిలో జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, ఆంచూర్ పొడి వేసి 1 నిమిషం వేయించి బంగాళాదుంపలను చిదుముకుని వేసి ,ఉప్పు, కారం వేసి అన్ని కలిసేట్టు కలుపుకోవాలి .
- Step 3
ఈ మిశ్రమాన్నీ మెత్తగా గుజ్జులా మెదుపుకోని చల్లారనివ్వాలి. తరువాత గోధుమ పిండి ముద్దని తీసుకుని చివరలు పలుచగా మధ్యలో మందంగా ఉండేట్టు గుండ్రంగా వత్తుకోవాలి .
- Step 4
ఇలా వత్తుకున్న చపాతీ మధ్యలో బంగాళాదుంప మిశ్రమాన్నీ ఉంచి మూసివెయ్యాలి.
- Step 5
తరువాత చపాతీ కర్రతో వత్తుతు లోపల పెట్టిన మిశ్రమం బయటికి రాకుండా సమంగా ఉండేట్టు నెమ్మదిగా గుండ్రంగా చేసుకోవాలి.
- Step 6
పిండి అంటుకోకుండా ఉండాలి అంటే పొడి గోధుమపిండి చల్లుకుంటూ ఉండండి.
- Step 7
ఇలా తయారు అయిన పరాటాలని పెనం మీద నెయ్యి వేసి రెండు వేపులా మీడియం మంట మీద కాల్చుకొని తీసుకోవాలి. అంతే వేడి వేడి ఆలూ పరాట సిద్ధం .