- Step 1
మినపప్పుని ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడిగి నీరుపోసి 4 నుంచి 5 గంటలు నానపెట్టుకోవాలి.
- Step 2
తరువాత మరొకసారి శుభ్రంగా కడిగి, నీరు వంపేసి మిక్సీలో లేదా గ్రైండర్ లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 3
తరువాత ఇడ్లీ రవ్వని ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడుగుకోవాలి. 20 నిముషాలు నానపెట్టుకోవాలి.
- Step 4
తరువాత నీరు వంపేసి రవ్వలోని నీటిని గట్టిగా పిండి, ముందుగా చేసిపెట్టుకున్న మినప పిండిలో వేసుకోవాలి.
- Step 5
అలా రవ్వ అంతా వేసుకున్నాక మినప పిండి మరియు రవ్వని చేతితో బాగా కలిసేలా కలియబెట్టి 7-8 గంటలు కొంచెం వేడి ఉన్న ప్రదేశంలో పెట్టుకొపోవాలి.
- Step 6
ఇలా చేయటం వలన పిండి కొంచెం పులిసి ఇడ్లీ రుచిగా ఉంటాయి.
- Step 7
తరువాత పిండిలో కావాల్సినంత ఉప్పు చల్లి, కావాలి అనుకుంటే కొంచెం నీరు కూడా పోసుకుని ఇడ్లీ వేయటానికి వీలుగా మరీ గట్టిగా కాకుండా కొంచెం పలచగా పిండిని కలుపుకోవాలి.
- Step 8
తరువాత ఇడ్లీ పాత్ర తీసుకుని దానిలో ఒక గ్లాస్ నీరు పోసుకుని స్టవ్ మీద పెట్టాలి, ఇడ్లీ ప్లేట్లని కడిగి వాటిల్లో స్పూన్ సహాయంతో లేదా చేతితో కొద్దీ కొద్దిగా పిండి వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 10 నిమిషాలు పాటు ఉడికించుకోవాలి,అంతే వేడి వేడి ఇడ్లీ సిద్ధం .