- Step 1
ముందుగా బ్రెడ్ ని చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
అలాగే క్యారెట్, ఉల్లిపాయలు, టమాటా ,పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచుకోవాలి.
- Step 3
తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి అయ్యాక బ్రెడ్ ముక్కలు వేసి కొంచెం గట్టిగా అయ్యే వరకు దోరగా వేయించుని పక్కన పెట్టుకోండి.
- Step 4
అదే కడాయిలో మరి కొంచెం నూనె వేసి వేడి అయ్యాక ,జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, పచ్చిబఠాణీ వేసి ఉప్పు చల్లి 5 నిమిషాలు వేయించుకుని ,తరువాత టమాటా ముక్కలు కూడా వేసి కలిపి మరో 3 నిమిషాలు మగ్గించుకుని ,చాట్ మసాలా,మ్యాంగో పొడి వేసి కలుపుకోవాలి.
- Step 5
ఎక్కువ నీరు లేకుండా కూరని వేయించుని చివరగా బ్రెడ్ ముక్కలు, కొత్తిమీర వేసుకుని కలిపి ప్లేటులోకి తీసుకుని మిక్సర్ వేసి, నిమ్మరసం చల్లుకుని తింటే చాల రుచిగా ఉంటుంది.