- Step 1
ముందుగా బియ్యాన్ని బాగా శుభ్రపరుచుకుని, కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి ఉడికించుకోవాలి(కుక్కర్ / రైస్ కుక్కర్ లో ఉడికించుకున్న పర్వాలేదు). ఉడికిన అన్నాన్ని వెడల్పాటి గిన్నెలో కానీ, ప్లేట్లో కానీ ఆరపెట్టుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారాక తాలింపుకు సిద్దంచేసుకోవాలి.
- Step 2
ఒక చిన్న కడాయిలో నూనె పోయాలి.
- Step 3
నూనె వేడి అయ్యాక ఇంగువ, తాలింపు సామాను, జీడిపప్పు, పల్లీలు,సన్నగా తరిగిన అల్లం మరియు పచ్చిమిర్చి(మధ్యకి నిలువుగా కోసుకోవాలి ) వేయ్యాలి. పప్పులన్నీ ఎర్రగా అయ్యేవరకు వేయించుకోవాలి.
- Step 4
వేగిన పప్పులలో పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- Step 5
ఆరబెట్టిన అన్నంలో ఈ పప్పుల తాలింపు, ఉప్పు మరియు నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి . అంతే రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ.