- Step 1
స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో మూడుకప్పుల వాటర్ , సాల్ట్ కొంచెం, ఆయిల్ ఒకస్పూన్ వేసి మరగనివ్వాలి .
- Step 2
మరిగాక అందులో బియ్యం పిండి వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
- Step 3
తరువాత స్టవ్ ఆఫ్ చేసి దించుకొని పక్కన పెట్టుకోవాలి .
- Step 4
అలాగే పచ్చిశనగపప్పు ని మెత్తగా ఉడికించుకుని పక్కనపెట్టుకోవాలి.
- Step 5
ఇప్పుడు ఈ ఉడికించిన పచ్చిశనగపప్పులో బెల్లంతురుము వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
- Step 6
అందులోనే ఇలాచీ పొడి వేసి , ఎండుకొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి .
- Step 7
ఉడికించిన బియ్యంపిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెం చేత్తో తీసుకుని చిన్న చిన్న పూరి లాగా చేసి దాని మధ్యలో పూర్ణం మిశ్రమాన్ని పెట్టి గుండ్రం గా చేసుకోవాలి , ఇలా అన్ని చేసి పెట్టుకోవాలి.
- Step 8
ఇప్పుడు వీటిని ఇడ్లీ కుక్కర్ లో ఆవిరి మీద అయిదు నిమిషాలు ఉడికించి దించుకోవాలి.