- Step 1
చిక్కుడుకాయలు, బంగాళాదుంపలు, టొమాటోలు, ఉల్లిపాయలు అన్నీముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
- Step 2
ఉల్లిముక్కలు, అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు, కారం వేసి మెత్తగా రుబ్బాలి.
- Step 3
స్టవ్‌మీద బాణెలిపెట్టి నూనె వేసి కాగిన తరవాత రుబ్బిన ఉల్లిముద్ద వేసి వేయించాలి.
- Step 4
కమ్మని వాసన వచ్చిన తరవాత చిక్కుడుకాయ ముక్కలు వేసి మరికొంతసేపు వేయించాలి.
- Step 5
బంగాళాదుంపముక్కలు, టొమాటో ముక్కలు వేసి ఓ గ్లాసు నీళ్లు పోసి ఉప్పు, పసుపు వేసి ప్రెషర్‌కుక్కర్ లోకి మార్చాలి.
- Step 6
ఒక విజిల్ వచ్చిన తరవాత దించి చల్లారిన తరవాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వడ్డించాలి. అంతే చిక్కుడు మసాలా కూర రెఢీ.