- Step 1
బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి ముక్కలు చేసుకోవాలి.
- Step 2
పాత్రలో నూనె వేడయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించాలి.
- Step 3
ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలు వేయించాక టొమోటో ముక్కల్ని జత చేయాలి.
- Step 4
ఆపై అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసి కలపాలి.
- Step 5
చివరిగా బంగాళాదుంప ముక్కల్ని కూడా జతచేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి వేసి కలియబెట్టాలి.
- Step 6
కాసేపు అలాగే ఉడికించిన తరువాత కొత్తిమీర తరుగును పైన చల్లి దించేయాలి. అంతే బంగాళాదుంపల కూర తయారైనట్లే.