- Step 1
ముందుగా దోసకాయల్ని చెక్కుతీసి ముక్కలుగా చేసుకోవాలి.
- Step 2
పాత్రలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఉల్లిపాయల్ని వేసి గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి.
- Step 3
పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తరువాత ఒకటి వేసి అర నిమిషంపాటు వేయించాలి.
- Step 4
టొమోటో ముక్కల్ని జతచేసి పది నిమిషాలు వేయించాలి. వేగుతున్న టొమోటో మిశ్రమంలో దోసకాయ ముక్కల్ని వేసి కలియబెట్టాలి.
- Step 5
పదినిమిషాలు అలాగే వేగిన తరువాత ఉప్పు, కారం, ధనియాలపొడి వేసి కలిపి, మరో పది నిమిషాలు వేయించాలి
- Step 6
దోస ముక్కలు మెత్తబడ్డాక కొబ్బరిపొడి వేసి కలిపి దించేయాలి. చివర్లో కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే సరి.