- Step 1
అరకిలో బంగాళా దుంపలను ఉడికించి పొట్టు తీసి మెత్తగా పొడి పొడిగా చిదపాలి.
- Step 2
మూడు ఉల్లిపాయలు, మిరపకాయలను తరిగి దానికి ఉప్పు, పసుపు, మసాలా పొడి కలిపి... చిదిమిన దుంపలకు కలపాలి.
- Step 3
తరువాత దీన్ని ముద్దలుగా తీసుకుని కట్‌లెట్‌ల ఆకారంలో తయారు చేసి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
మిగిలిన అరకిలో బంగాళా దుంపలను ఉడికించి పొట్టు వలిచి ముక్కలుగా తరగాలి.
- Step 5
ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, లవంగాయలు, దాల్చిన చెక్క, గసగసాలు వేసి ముద్దగా నూరాలి.
- Step 6
బాణెలిలో సరిపడా నూనె వేసి మరిగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి, మసాలా ముద్దను కూడా దానికి కలపాలి.
- Step 7
ఆ తరువాత కారం, బంగాళా దుంపలను వేసి వేయించి, దుంపలు మునిగేంత వరకు నీరు పోయాలి.
- Step 8
మూత పెట్టి ఉడికించిన తర్వాత కట్‌లెట్స్ కూడా వేసి... విడిపోకుండా కలియబెట్టాలి..
- Step 9
సరిపోయేంత ఉప్పు వేసి కూర గ్రేవీలా మారిన తర్వాత దించి, సన్నగా తరిగిన కొత్తి మీర చల్లుకోవాలి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది.