- Step 1
బెండకాయలను అంగుళం సైజు ముక్కలుగా తరగాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా ముక్కలు తరగాలి. అల్లం, వెల్లుల్లి ముద్ద నూరుకొని ఉంచుకోవాలి.
- Step 2
బాణెలి లో నూనె వేసి మరిగాక బెండకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసి దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- Step 3
మిగిలిన నూనెలో కరివేపాకు, జీలకర్ర వేసి కాస్త వేగిన తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి.
- Step 4
ఆ తరువాత అందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద, కారం వేసి చిన్న చిన్నగా కోసుకుని ఉంచుకున్న టమోటా ముక్కలను చివర్లో వేసి వేయించాలి.
- Step 5
టమోటాలు బాగా మగ్గిన తర్వాత వేయించి పక్కన ఉంచుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి ఒక కప్పు నీరు పోసి ఉడికించాలి.
- Step 6
కూర చిక్కబడిన తర్వాత దించేయాలి. ఇష్టమైతే కొత్తిమీర చల్లుకోవచ్చు.