- Step 1
కందిపప్పు, బంగాళా దుంపల్ని కుక్కర్లో బాగా ఉడికించుకోవాలి.
- Step 2
స్టౌమీద బాణెలి లో వేడయ్యాక నూనెపోసి తాలింపు వేసి, తాలింపు వేగాక ఉల్లి, పచ్చిమిర్చి తరుగులను వేసి దోరగా వేయించాలి.
- Step 3
తర్వాత పుదీనా, కరివేపాకు, ఆలు, గుమ్మడి తరుగులు ఒక్కొక్కటిగా వేసి వేపాలి. తరువాత ఉప్పు, కారం, టమోటా, గరం మసాలా వేసి కొంచెం నీరు చేర్చి కాసేపు ఉడకనివ్వాలి.
- Step 4
పదినిమిషాల తర్వాత దించి ఓ పాత్రలోకి తీసుకుని కొత్తిమీర, మీగడ, కొబ్బరి చల్లి వేడివేడిగా సర్వ్ చేయాలి.
- Step 5
ఈ గుమ్మడి పప్పును రైస్‌తో పాటు రోటీలకు సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.