- Step 1
ముందుగా ఒక పాత్రలో నీళ్లు పోసి చింతకాయ ముక్కలను వేసి మెత్తగా ఉడికించి, మెదుపుకోవాలి.
- Step 2
మెదిగిన చింతకాయ ముక్కలను గట్టిగా పిండి రసం తీసుకోవాలి..
- Step 3
తర్వాత, కుక్కర్‌లో రెండు కప్పుల నీటిని పోసి అందులో కందిపప్పు, పాలకూర, పచ్చిమిర్చి వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
- Step 4
ఇప్పుడు ఒక బాణెలిలో నూనె వేసి వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసి గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి.
- Step 5
తర్వాత, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి ఇంకో రెండు నిమిషాలు వేయించాలి.
- Step 6
ఇప్పుడు ఉడికించుకున్న పప్పు మిశ్రమాన్ని పోపులో పోసి, చింతకాయ గుజ్జు, ఉప్పు, తగినంత నీటిని అందులో కలిపి, పదిహేను నిమిషాలు ఉడికించి దించేయాలి.
- Step 7
చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వడ్డించాలి.