- Step 1
బ్రెడ్ ను చిన్న చిన్న ముక్కలు గా చేసుకోవాలి.
- Step 2
ఒక అరకప్పు నేతిని బాణెలిలో తీసుకోని, కొంచం వేడి అయిన తర్వాత బ్రెడ్ ముక్కలను బంగారు వర్ణం వచ్చేంతవరకు వేయించుకోవాలి.
- Step 3
బాదం, ఏలకులు, జీడిపప్పు సగం తీసుకోని ముద్దగా చేసుకోవాలి, మిగతావి నేతిలో వేయించికోవాలి.
- Step 4
పాలను ఒక గిన్నెలో తీసుకొని, మరగబెట్టి, దానికి పంచదారను కలపాలి. అది బాగా కలిసేంతవరకు కలియబెట్టుకోవాలి.
- Step 5
పంచదార బాగా కలిసిన తర్వాత, దీనికి మిగిలిన నెయ్యి, వేయించిన బ్రెడ్ ముక్కలు కలపాలి.
- Step 6
సన్నని సెగపై ఈ మిశ్రమాన్ని బ్రెడ్ మెత్తగా ఉడకనివ్వాలి . దీనిలో ఇప్పుడు జీడిపప్పు ముద్దను వేసి, కలుపుకోవాలి.
- Step 7
స్టవ్వు మీద నుండి తీసుకొని జీడిపప్పు, బాదం, ఏలక్కుల పొడి చల్లుకోవాలి.బాగా కలిసిన తర్వాత స్టవ్ మీద నుండి దించుకోవాలి
- Step 8
వేడి వేడి గా తిన్నా, లేక ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా తిన్నా ఎంతో బాగుంటుంది.వేడి వేడిగా ఉన్నప్పుడు ఐస్-క్రీమ్ తో పిల్లలకు పెడితే వాళ్ళు ఎంతో ఇష్టపడతారు