- Step 1
ముందుగా నువ్వులు, మినప్పప్పులను వేయించి పొడిచేసి ఉంచుకోవాలి.
- Step 2
పొడి పొడిగా వార్చిన అన్నంలో నువ్వులు, మినప్పప్పు పొడితోపాటు మామిడి, కొబ్బరి తురుము, పసుపులను వేసి బాగా కలియబెట్టాలి.
- Step 3
తరువాత మొలకెత్తిన పెసళ్లను ఉడికించి ఉంచాలి.
- Step 4
ఇప్పుడు బాణెలిలో కాస్త నూనె వేసి జీడిపప్పు, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా వేయించాలి.
- Step 5
అందులోనే క్యాప్సికం, క్యారెట్ తరుగు, పెసళ్లను వేసి మరికాసేపు వేయించాలి.
- Step 6
ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి.
- Step 7
చివర్లో కొత్తిమీర తరుగు పైన చల్లాలి.
- Step 8
అంతే రుచికరమైన మ్యాంగో ఫ్రైడ్‌రైస్ తయార్.