- Step 1
కూరగాయలన్నింటినీ కడిగి శుభ్రం చేసి, సన్నటి ముక్కలుగా తరిగి ఉంచాలి.
- Step 2
మరుగుతున్న నీటిలో ఈ కూరగాయల ముక్కల్ని వేసి ఐదు నిమిషాలుంచి తీసివేయాలి.
- Step 3
బాణెలిలో నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలను వేసి వేయించాలి.
- Step 4
ఆ తరువాత అల్లం వెల్లుల్లి మిశ్రమం, కారం, పసుపు, జీడిప్పపు, గసగసాల ముద్ద వేసి దోరగా వేయించాలి.
- Step 5
తరువాత ఉడుకుతున్న మిశ్రమంలో ఉడికించిన పక్కన ఉంచిన కూరగాయ ముక్కలను వేసి ఫ్రై చేయాలి.
- Step 6
ఇప్పుడు అందులో పెరుగు, టొమోటోలు, తగినంత ఉప్పు కలిపి చిక్కబడేదాకా ఉడికించాలి.
- Step 7
కూర ఉడుకుతుండగానే పనీర్ తురుమును కూడా అందులో వేసి కలియబెట్టాలి.
- Step 8
కూర బాగా ఉడికిన తరువాత దించివేసి కొత్తిమీర చల్లి వడ్డించాలి. అంతే వెజిటబుల్ జైపురి రెడీ.