- Step 1
కీర దోసకాయలను చేదు లేకుండా చూసి, వాటి చెక్తు తీసి, నిలువుగా కోసి, విత్తనాలుంటే తీసివేయాలి.
- Step 2
తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా నలుచదరంగా తరిగి, చల్లటి నీటిలో వేసి ఉంచాలి.
- Step 3
టమోటోలను కూడా నిలువుగా కోసి, వాటి రసం, విత్తనాలను తీసివేసి సన్నగా తరగాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీరలను కూడా సన్నగా తరిగి ఉంచాలి.
- Step 4
ఇప్పుడు ఒక గిన్నెలో రీఫైన్డ్ ఆయిల్‌ను వేసి దానికి ఉప్పు, నిమ్మరసం, మిరియాలపొడి చేర్చి. చేతివేళ్ళతో బాగా కలపాలి.
- Step 5
ఆ తర్వాత దాంట్లోనే తరిగిన టమోటో ముక్కలు, కీరదోస ముక్కలను కలిపి ఫ్రిజ్‌లో పెట్టి, చల్లగా అయిన తర్వాత తీయాలి. అంతే కీర దొస సమ్మర్ స్పెషల్ రెఢీ.