- Step 1
సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి కప్పు నీటిలో సుమారు అరగంటసేపు నాననివ్వాలి. పాలను మరిగించాలి
- Step 2
సగ్గుబియ్యంలో తగినంత నీరు పోసి ఉడికించి ఎక్కువగా ఉన్న నీటిని ఒంపేయాలి
- Step 3
బాణలిలో నెయ్యి వేసి కరిగాక, క్యారట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి తీసేయాలి.
- Step 4
అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేయించి తీసేయాలి
- Step 5
ఒక చిన్న పాత్రలో టీ స్పూను పాలు, కుంకుమపువ్వు వేసి కలపాలి
- Step 6
మరుగుతున్న పాలలో ఉడికించిన సగ్గుబియ్యం, వేయించి ఉంచుకున్న క్యారట్ తురుము, ఏలకులపొడి, కుంకుమపువ్వు పాలు వేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉంచాలి
- Step 7
వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్‌మిస్‌లు వేసి కలిపి దించేయాలి.