- Step 1
ఓవెన్‌ని 180 డిగ్రీల సెంటీ(గేడ్ వద్ద వేడి చేయాలి.
- Step 2
ఒక గిన్నెలో వరిపిండి, బటర్, రెండు కోడిగుడ్లు, తేనె, బేకింగ్ పౌడర్, కుంకుమ పువ్వు, ఉప్పు అన్ని బాగా మిక్స్ చేయాలి.
- Step 3
ఈ పిండిని కేక్‌పాన్‌లో వేయాలి. వేసేముందు పాన్‌కి కొద్దిగా బటర్ రాయాలి.
- Step 4
15 నుంచి 20నిమిషాల పాటు ఓవెన్లో బేక్ చేయాలి. బయటకు తీసి కాసేపు చల్లారనివ్వాలి.
- Step 5
ఇప్పుడు ఒక గిన్నెలో కోడిగుడ్డులోని తెల్లసొన, క్రీమ్, నిమ్మరసం అన్ని వేసి బాగా కలపాలి. దీంట్లోనే మపిల్ సిరప్‌ని కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని కేక్‌పైన పోయాలి.
- Step 6
పై నుంచి స్ట్రాబెరీలను చిన్న ముక్కలుగా కట్‌చేసి డెకరేట్ చేయాలి. పై నుంచి పిస్తాతో గార్నిష్ చేయాలి. అంతే.. తియ్యటి స్ట్రాబెరీ కేక్ మీ ముందుంటుంది.