- Step 1
చికెన్ బాగా కడిగి కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్దను చికెన్ ముక్కల ఫై బాగా రాసి గంట సేపు పక్కన పెట్టుకోవాలి.
- Step 2
పాన్ తీసుకోని దానిలో నునె వేసి దానిలో గరం మసాలా దినుసులు, ఉల్లిపాయల ముక్కలు, మిగిలిన అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించాలి
- Step 3
తరువాత ఉప్పు, కారం, పసుపు మరియు గరం మసాలాతో పాటుగా ముక్కలను కూడా వేయాలి.
- Step 4
ఇప్పుడు ముక్కలకు మసాలా బాగా పట్టేలా చూసుకుని నీరు కలిపి ఉడికించాలి.
- Step 5
ఆ తరువాత 10 నుంచి 12 నిమిషాలు తరువాత ఎండు మిర్చి, కొబ్బరి, నువ్వులు, ధనియాలను వేయించి మిక్సీ చేసుకుని పేస్టు లాగ కలపాలి.
- Step 6
చిట్ట చివరకు దీనిని దించే ముందు పెరుగు కలిపి కొంచెం కొత్తి మీర మరియు కొంచెం గరం మసాలా చల్లితే తినటానికి చాలా రుచిగా ఉంటుంది