- Step 1
ముందుగా పాన్ లో చికెన్ ముక్కలు వేసి ముక్కలు మునిగే దాకా నీరు పోసి ముక్కలతో పాటుగా లవంగాలు, మిరియాలు, ఉప్పు వేసి నీరు సగం మరిగేదాకా ఉడికించాలి.
- Step 2
ముక్కలు బాగా ఉడికిన తరువాత చికెన్ ముక్కలని వడకట్టాలి.
- Step 3
తరువాత పాన్ లో నూనె వేసి అందులో జీలకర్ర, వెల్లులి, అల్లం పేస్టు వేసి పచ్చి పోయేదాకా వేయించండి, బాగా వేగిన తరువాత దానిలో మొక్కజొన్నపిండిని, పసుపుని వేసి ఉడికించాలి.
- Step 4
తరువాత దానిలో ముందుగా తాయారు చేసుకున్న చికెన్ స్టాక్ పోయాలి.
- Step 5
తరువాత దానిలో ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి రెందు మూడు నిమిషాలు వేడి చేసి దించుకోవాలి.
- Step 6
అంతే మనం ఇప్పటి వరకు ఎదురుచూసిన కార్న్ చికెన్ సూప్ రెడీ.