- Step 1
ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒకటి రెండు గంటలు ముందు నానబెట్టిన శెనగలు వేసి, అందులోనే కొన్ని నీళ్ళు పోసి, 3నుండి 4విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి.
- Step 2
చెన్నా పూర్తిగా మెత్తగా ఉడికిన తర్వాత, ఎక్సెస్ వాటర్ వంపేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
తర్వాత మిక్సీ జార్లో 2 టమోటోలు ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి.
- Step 4
ఇప్పుడు పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి.
- Step 5
తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, కారం, టమోటో గుజ్జుగా వేసి మిక్స్ చేయాలి.
- Step 6
ఉప్పు తర్వాత మిక్స్ చేసి ఉడికించాలి, చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.