- Step 1
పాన్ లో నువ్వులు, మినపప్పు, పెసరపప్పు విడివిడిగా వేయించాలి. ఈ మూడింటినీ కలిపి మెత్తనిపొడిలా చేసుకోవాలి.
- Step 2
తర్వాత అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, ద్రాక్ష, బాదం దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి సేమియాను వేయించి పెట్టుకోవాలి.
- Step 3
పాలు కాగాక.. కొబ్బరిపాలనూ చేర్చి.. మరోసారి మరగనివ్వాలి. సన్నని మంటపై ఉంచి..సేమియా వేయాలి. కొద్ది సేపటి తర్వాత పంచదార కలపాలి.
- Step 4
ఇప్పుడు అరకప్పు పాలు తీసుకుని ముందుగా సిద్ధం చేసిపెట్టుకున్న పొడిని కలిపి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేయాలి. పదినిమిషాలయ్యాక జీడిపప్పు, యాలకులపొడి వేసి కలిబెట్టాలి.
- Step 5
నువ్వులు, మినపప్పు, పెసరపప్పు.. రుచితో పాటు.. చిక్కదనాన్ని ఇస్తాయి. చివరగా జీడిపప్పు, ద్రాక్ష, బాదంతో గార్నిష్ గా చేసి పండగ పూట వచ్చిన అతిథులకు అంధించడమే...