- Step 1
మినపప్పు, బియ్యాన్ని విడివిడిగా సుమారు నాలుగుగంటలు నానబెట్టాలి.
- Step 2
మినపప్పుని కడిగి, బియ్యం కలిపి మెత్తగా రుబ్బాలి. (మరీగట్టిగాను కాదు, పల్చగాను కాదు) మధ్యస్తంగా వుండాలి.
- Step 3
దీనిలో కలర్ కలపాలి. .
- Step 4
ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒకగిన్నెలో పంచదార వేసి, కొద్దిగా నీళ్ళు కలిపి పాకం పట్టాలి. (తీగ పాకం పట్టాలి)
- Step 5
పాకం వచ్చాక యాలుకల పొడి వేసి కలపాలి.
- Step 6
పక్క స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి.
- Step 7
నూనె కాగాక, ఒక గుడ్డకి మద్యలో చిన్న రంద్రం పెట్టి, దానిలో పిండిని వేసి అంచులు కలిపి పట్టుకొని రంద్రాన్ని వేలుతో మూసి వెయ్యాలి.
- Step 8
కాగుతున్న నూనెలో (రంద్రానికి అడ్డుగా వున్న వేలు తీసి) జాంగిరి ఆకారంలో పిండిని