- Step 1
బంగాళదుంపలను ఉడికించి మెత్తగా మాష్ చేయాలి బాణలిలో నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి
- Step 2
పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లితరుగు వేసి వేయించాలి ఉడికించిన బఠాణీలు జత చేయాలి
- Step 3
పసుపు, ఉప్పు, బంగాళదుంప పేస్ట్ వేసి రెండుమూడు నిమిషాలు ఉడికించాలి కొత్తిమీర జత చేసి కలిపి దించి చల్లారనివ్వాలి
- Step 4
ఇడ్లీ రేకులకు నూనె రాసి, టేబుల్ స్పూను ఇడ్లీ పిండి వేసి, దాని మీద తయారుచేసి ఉంచుకున్న కూర, ఆ పైన రెండు టేబుల్‌స్పూన్ల ఇడ్లీ పిండి వేసి, కుకర్‌లో ఉంచి, ఒక విజిల్ వచ్చాక దించేయాలి ఇడ్లీలను తీసి, మధ్యకు కట్ చేసి, చట్నీతో సర్వ్ చేయాలి.