- Step 1
కొరమీను చేపను కడిగి శుభ్రం చేసుకోవాలి.
- Step 2
దానిలో తగినంత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి 20 నిమిషాలపాటు నానబెట్టాలి.
- Step 3
ఆ తర్వాత గ్యాస్ వెలిగించి ఓపాత్ర పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి.
- Step 4
నూనె కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి.
- Step 5
బాగా వేగాక చేప ముక్కలు కూడా చేర్చి 2 నిమిషాలు వేయించి తగిన నీళ్లు పోసి మూత పెట్టి సన్నని మంట మీద ఉడికించాలి.
- Step 6
చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి రెండు నిమిషాల తరువాత దించెయ్యాలి.
- Step 7
చల్లారిన తరువాత ఇంకా రుచిగా ఉండే ఈ పులుసు రెండు రోజులైనా అదే రుచితో ఘుమఘుమలాడుతూ ఉంటుంది.