- Step 1
ముందుగా రొయ్యలని శుభ్రం చేసి పెట్టుకుని అందులో పసుపూ, కొద్దిగా ఉప్పూ, సగం అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వాటికి పట్టేట్టుగా కలిపిపెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు కడాయిలో నూనె వేసి అది వేడెక్కాక తరిగిన ఉల్లిపాయముక్కలూ, పచ్చిమిర్చీ వేసి దోరగా వేయించుకోవాలి.
- Step 3
ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో రొయ్యలు కూడా వేయాలి. పచ్చివాసన పోయేవరకూ వేయించి అప్పుడు మూత పెట్టి మరికాస్త సేపు మగ్గనివ్వాలి
- Step 4
ఇప్పుడు చింతచిగురుని అరచేతుల్లో వేసి బాగా నలిపితే పొడిలా తయారవుతుంది.
- Step 5
దీన్ని రొయ్యల్లో వేసి మిగిలిన అల్లంవెల్లుల్లి పేస్టూ, వెల్లుల్లిరేకలూ చేర్చాలి.
- Step 6
తర్వాత ఉప్పూ, కారం, గసగసాలపొడీ, జీలకర్రపొడి, దాల్చిన చెక్కపొడి, ధనియాలపొడి వేసుకోవాలి.
- Step 7
అవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత కాసిని నీళ్లు పోసి మూతపెట్టేయాలి.
- Step 8
ఇందులో ప్రత్యేకించి మసాలా వేయాల్సిన అవసరం లేదు. కూర దగ్గరకు వచ్చిన తర్వాత దింపేసి, కొత్తిమీరతో అలంకరిస్తే చాలు.