- Step 1
పచ్చి రొయ్యలు శుభ్రం చేసుకుని కొద్దిగా ఉప్పువేసి మూడు కప్పుల నీళ్ళు పోసి ఉడికించాలి.
- Step 2
తర్వాత వీటిని జల్లెట్లో వేసి నీరంతా ఓడ్చాలి. ఒక గినెలో మైదా, కార్న్‌ఫ్లోర్, గుడ్డు, వంట సోడా, షెజ్వాన్ మసాలా పొడి, మిరియాల పొడి తగినంత ఉప్పు వేసి కలపాలి.
- Step 3
ఇందులో ఉడికించిన రొయ్యలు, తగినన్ని నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి.
- Step 4
మరీ పలుచగా ఉండకూడదు. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి కలిపి ఓ గంటసేపు మూత పెట్టి ఉంచాలి.
- Step 5
తర్వాత తీసి మరోసారి కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి చిన్న గరిట లేదా స్పూన్‌తో చిన్న చిన్న పకోడీల్లా వేసి అన్ని వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి.
- Step 6
ఇలా అన్నీ చేసుకుని వేడి వేడిగా టమాటా లేదా గార్లిక్ సాస్‌తో సర్వ్ చేయాలి.