- Step 1
ముందుగా ఉల్లిపాయ, ఉల్లికాడ, అల్లం, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- Step 2
ఫ్రైయింగ్ పానలో వెన్న వేసి కరిగిన తరువాత అందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ఉల్లికాడ ముక్కలు అన్నింటినీ వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి.
- Step 3
ముక్కలన్నీ మెత్తగా అయ్యేవరకు వేయించి, అందులో వెజిటబుల్ స్టాక్ (కూరగాయ ముక్కలు ఉడికించుకున్న నీళ్లు) పోసి బాగా ఉడికించాలి.
- Step 4
తర్వాత కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.
- Step 5
సూప్ చిక్కగా మారే సమయంలో స్టవ్ ఆఫ్ చేసేయాలి. బట్టర్‌తో గార్నిష్ చేసుకుని, వేడివేడిగా సర్వ్ చేయాలి.