- Step 1
ఒక గిన్నెలో నూనె వేడిచేసి వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం వేగించాలి.
- Step 2
తరువాత క్యాప్సికమ్, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి క్యాప్సికమ్ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించి మంట ఆపేయాలి.
- Step 3
ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా చేయాలి. దీన్ని వడకట్టి తొక్కలు తీసేయాలి.
- Step 4
ఒక గిన్నెలో వడకట్టిన సూప్, చికెన్ లేదా కూరగాయలు ఉడికించిన నీళ్లు పోసి స్టవ్ వెలిగించాలి.
- Step 5
దీనిలో ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేయాలి.
- Step 6
సూప్ ఉడికేటప్పుడు మీగడ కలిపితే చిక్కగా అవుతుంది. లేదా నీళ్లు కలిపిన మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని అయినా కలపొచ్చు.
- Step 7
ఐదు నిమిషాల తరువాత స్టవ్ ఆపేసి మీగడ, వేగించిన బ్రెడ్ ముక్కలు వేసుకుని వేడివేడిగా తాగితే సూపర్గా ఉంటుంది.