- Step 1
బియ్యంలో కుంకుమపువ్వు కలిపి (పొడిగా) అన్నం వండి పక్కనుంచాలి.
- Step 2
కూరగాయల్ని సన్నగా తరగాలి. పీతలలో ఎముకల్ని తీసేయాలి (ఇష్టమైతే 4 పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు).
- Step 3
కడాయిలో వెన్న కరిగించి ఉల్లి, మిర్చి, టమోటా, పుదీనా, కొత్తిమీర తరుగు, జీలకర్ర, కారం, పసుపు, గరం మసాల పొడులు ఒకటి తర్వాత ఒకటి దోరగా వేగించాలి.
- Step 4
తర్వాత పీత ముక్కలు, ఉప్పు వేసి సన్నని మంటపై మూతపెట్టి మగ్గించాలి.
- Step 5
పీత (ముక్కలు) ఉడికిన తర్వాత కడాయి దించేయాలి.
- Step 6
ఒక లోతైన పాత్రలో ఉడికిన అన్నం, పీత మిశ్రమం ఒకదాని తర్వాత ఒకటి లేయర్లుగా పరిచి పైన నెయ్యి , కొన్ని పుదీనా ఆకులు చల్లి మూతపెట్టి సన్నని మంటపై రెండు నిమిషాలు ఉంచి దించేయాలి.