- Step 1
యాంటీ ఆక్సిడెంట్‌లు సమృద్ధిగా కలిగిన టొమాటో, రక్తాన్ని శుద్ధి చేయటమేకాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించి హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది.
- Step 2
విటమిన్ ఎ, విటమిన్ బి , విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, టొమాటోలో సమృద్ధిగా వున్నాయి.
- Step 3
టొమాటో, క్యారెట్, నీళ్ళు, నల్ల ఏలకులు, మిరియాలు, బిర్యాని ఆకులు, వెల్లుల్లి, ఉల్లిపాయ, పంచదార, పప్పులను కుక్కర్‌లో ఉడికించాలి.
- Step 4
కుక్కర్ మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది. మెత్తగా అయిన టొమాటో మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి మెత్తగా చేత్తో మెదిపి ఆ గుజ్జును కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు.
- Step 5
లేదా మిశ్రమాన్ని గ్రైండ్ చేసి గుజ్జును వడకట్టి తీసుకోవచ్చు. ఫ్రయింగ్‌పాన్‌లో వెన్న లేదా నెయ్యివేసి బ్రెడ్ ముక్కలను వేయించాలి.
- Step 6
సూప్ తాగేముందు వేయించిన బ్రెడ్ ముక్కలను వేసి తీసుకుంటే బ్రెడ్ క్రిస్పీగా వుంటుంది.