- Step 1
రెండు కప్పుల నీటిని వేడి చేసి అందులో జింజర్ లెమన్ టీ పొడి బ్యాగులను వేసి ఓ పదినిమిషాల పాటు అలాగే ఉంచాలి.
- Step 2
ఆ తర్వాత వాటిని తీసేయాలి. ఒక కడాయిలో నూనె వేసి ఉల్లిగడ్డలు బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాలి.
- Step 3
దీంట్లో వెల్లుల్లిపాయలు, అల్లం, గరం మసాలా, జీలకర్ర, తెల్ల మిరియాల పొడి, ఉప్పు వేసి రెండు నిమిషాలపాటు కలపాలి.
- Step 4
ఆ తర్వాత స్వీట్ పొటాటోలను వేసి బాగా కలపాలి. బాగా వేగాక టీ మిశ్రమం, కొబ్బరి పాలు పోసి ఉడికించాలి.
- Step 5
సన్నని మంట మీద ఉంచి కఫీర్ లైమ్ లీవ్స్, స్వీట్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసి 20నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
- Step 6
స్వీట్ పొటాటోలు మెత్తగా ఉడికిన తర్వాత దించి ప్యూరీలా చేసి మరికాసేపు ఉడికించాలి. ఆ ప్యూరీని తీసేసి సూప్‌ని కాసేపు వేడి చేసి దించేయాలి.
- Step 7
వేడి.. వేడి.. జింజర్ టీ అండ్ కోకోనట్ సూప్ సర్వ్ చేయడానికి రెడీగా ఉంటుంది.