- Step 1
ముందుగ అన్ని కూరగయలని కడిగి సన్నని పొడవుగా కట్ చేసుకోవాలి.
- Step 2
ఇప్పుడు కందిపప్పును కుక్కర్ లో వేసి కడిగి నీళ్ళు పోసి మరొక గిన్నెలో ముందుగ కట్ చేసుకున్న కూరగయ ముక్కలను వేసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి
- Step 3
తరువాత కడాయిలో నూనె వేసి కాగిన తరువాత పోపుగింజలు వేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటోముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గే వరకు ఉంచి చింతపండు రసం, ఉడికించిన కూరగయ ముక్కలు, పసుపు, ఉప్పు, సరిపడ కారం కూడా చేర్చి ఈ మిశ్రమాన్ని ముందుగ ఉడికించిన పప్పులో కలిపి సరిపడ నీళ్ళు పోసి 10 నిముషాలు మరగనివ్వాలి.
- Step 4
ఇప్పుడు సాంబార్ పొడి, కొత్తిమీర వేసి కలిపి దింపుకోవాలి. అంతే గుమగుమలాడే మిక్సిడ్ వెజిటేబుల్ సాంబార్ తయార్.
- Step 5
గమనిక : కూరగయ ముక్కలు కుక్కర్ లో వద్దు అనుకుంటే వేరొక గిన్నెలో నీళ్ళు పోసి ఉడికించుకోవచ్చు.