- Step 1
కందిపప్పు ని మెత్తగా ఉడికించి పక్కన పెట్టు కోవాలి.
- Step 2
తరువాత మునక్కాడ మరియు టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 3
తరువాత ఒక గిన్నెలో సొరకాయ మునక్కాడ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 2 గ్లాసుల నీళ్ళు పోసి ఉడికించాలి.
- Step 4
సొరకాయ ముక్కలు బాగా ఉడికిన తరువాత చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు వేసి మరో 10 నిముషాలు ఉడికించాలి.
- Step 5
తరువాత అందులో ఉడికించిన పప్పు వేసి బాగా కలిపి మరో గ్లాస్ నీళ్ళు పోసి, సరిపడ కారం, ఉప్పు, సాంబార్ పొడి, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిసేపు ఉడికించాలి.
- Step 6
ఇప్పుడు బాణలిలో నూనె వేసి కాగాక పోపు గింజలు, ఎండు మిర్చి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా వేయించాలి.
- Step 7
తరువాత ఈ పోపుని మరుగుతున్న సాంబార్ లో వేసి కలిపి మరో 5 నిముషాలు మరిగించి దించెయ్యాలి.
- Step 8
అంతే రుచికరమైన సొరకాయ సాంబార్ తయార్. ఈ సాంబార్ ని వేడి అన్నములో కాని ఇడ్లీలో కాని తింటే చాల రుచిగా ఉంటుంది.