- Step 1
ఉలవలను ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీరు తీసి మంచి నీరు పోసుకుని కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తరువాత ఉడికిన ఉలవలను కొద్దిగా చల్లారిన తరువాత మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు బాణలిలో నూనె వేసి కాస్త వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
- Step 4
కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి.
- Step 5
వేగాక అల్లం, వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టమాటలు ముక్కలు కూడా వేసి ఉడికించుకోవాలి.
- Step 6
తరువాత కొద్దిగా కారం, ఉప్పు వేసి కలిపి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవల ముద్ద వేసి చింతపండు రసం పోసి రిగించుకోవాలి.
- Step 7
చివరగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి దింపుకోవాలి. అంతే. ఉలవల చారు తయార్.