- Step 1
చింత పండు ను ఒక గిన్నేలో నీళ్ళూ పోసి నానబెట్టుకోవాలి
- Step 2
స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని , పైన చెప్పిన పోపు దినుసులను వేసి వేగాక, ఉల్లి , టమాటో , వంకాయ , బెండకాయ ముక్కలను , వెల్లుల్లి రెబ్బలను వేసి దోరగా వేగనివ్వాలి .
- Step 3
ఇప్పుడు నానబెట్టిన చింతపండు ను , నానబెట్టిన నీళ్ళలో నుండి పిప్పిని తీసి వేసి , వేగిన ఉల్లిపాయ మిశ్రమాని వేసి , పసుపు , ఉప్పు, బెల్లము సరిపడునంతగా వేసి స్టవ్ మీద పెట్టాలి
- Step 4
ఒక 5 నిమిషాలు మరిగాక, ఒక 2స్పూన్స వరి పిండిని చిన్న కప్పులోకి తీసుకుని నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలుపుకుని , దానిని స్టవ్ మీద మరుగుతున్న పులుసులో కలిపుకుని కొంత సేపు మరగనివ్వాలి
- Step 5
15 నిమిషాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేస్తే ఉల్లిపాయ పులుసు రెడీ . దీనిని కందపొడి , కంది పచ్చడి లేక పాటోలి తో తింటే బాగుంటుంది.