- Step 1
బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పనీర్ ముక్కలను వేగించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత అదే బాణలిలో అల్లంవెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి రెండు నిమిషాలు వేగించాలి.
- Step 3
తర్వాత గోంగూర వేసి చిన్నమంట మీద మూతపెట్టి ఉడికించి మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 4
ఆ తర్వాత బాణలిలో మిగిలిన నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి వేగించాలి.
- Step 5
తర్వాత గోంగూర, కారం, ధనియాల పొడి, గరంమసాలా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి రెండు నిమిషాలు ఉడికించాలి.
- Step 6
చివరగా పనీర్ ముక్కలను వేసి బాగా కలిపి నిమిషం పాటు ఉడికించి దింపేయాలి.