- Step 1
మైదాలో వంటసోడా వేసి నీరు పోసి చిక్కగా ఉండలు లేకుండా కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి.
- Step 2
పిండి బాగా పులిసి తీగ లాగా సాగితేనే జిలేబీ బాగా వస్తుంది.
- Step 3
మరునాడు పొద్దున్న పిండిని మళ్ళీ కలిపి కాస్త కావాలంటే కస్త రంగు,నీరు కలిపి గరిటజారుగ కలిపి పెట్టుకోవాలి.
- Step 4
చక్కెరలో అరగ్లాసు నీరు పోసి మరిగించి తీగ పాకం పట్టి ఉంచుకోవాలి.
- Step 5
అందులోనే యాలకులపోడి కలిపాలి.
- Step 6
జిలేబీలు చేయడానికి ఒక మందపాటి గుడ్డకు చిన్న రంధ్రము చేసి అందులో పిండి వేసి చుట్టలాగ పట్టుకుని వేడి నూనెలో చుట్టలుగా వత్తుకోవాలి.
- Step 7
జిలేబీలు చేయడానికి సీసాలాంటివి దొరుకుతాయి సూపర్ మార్కెట్లలో.
- Step 8
జిలేబీలను ఎర్రగా వేయించి తీసి పాకంలో వేయాలి.
- Step 9
పదినిమిషాల తర్వాత తీసి విడి పళ్ళెంలో పెట్టాలి.