- Step 1
ముందుగా నువ్వులకు కొన్ని నీళ్ళు చల్లి చేతితో బాగా రుద్ది తర్వాత బియ్యం పిండి కూడా వేసి బాగా రుద్ది చెరగాలి.
- Step 2
పొడిపొడిగా ఉండేలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
- Step 3
బియ్యంలో నాలుగు కప్పుల నీళ్ళు, ఒక కప్పు పాలు, నెయ్యి వేసి కుక్కర్ లో పెట్టి మెత్తగా అన్నములాగా ఉడికించుకోవాలి.
- Step 4
డ్రై ఫ్రూట్స్ ను నేతిలో వేయించుకోవాలి.
- Step 5
కుక్కర్ లో విజిల్ వచ్చాక మూత తీసి మిగతా అన్ని పదార్థాలను వేసి సన్నని సెగపై ఉడకనివ్వాలి.
- Step 6
రెండు నిమిషాల తర్వాత నువ్వుల పొడి, డ్రైఫ్రూట్స్ కూడా వేసి బాగా కలపాలి. బెల్లం కరిగాక దించాలి.
- Step 7
అంతే ! కమ్మని 'పులుగం' రెడీ! ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.