- Step 1
మందపాటి గిన్నె లేదా బాండి తీసుకొని నూనె, నెయ్యి సమానముగా తీసుకొని కాగిన తర్వాత దొండకాయ ముక్కలు వేసి సన్నని సేగన బాగా మగ్గించుకోవాలి.
- Step 2
ఇవి ఉడికిన తర్వాత ముక్కలు మాత్రం తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు అదే నూనె లో మసాల దినుసులు వేసి వేయించుకోవాలి.
- Step 4
ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
- Step 5
ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, పూదీన జత చేయాలి.
- Step 6
ఇవి వేగిన తర్వాత కొబ్బరి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం పొడి వేసి కొద్ది సేపు వేయించుకోవాలి.
- Step 7
ఇవన్ని వేగిన తర్వాత దొండకాయ ముక్కలు, ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
- Step 8
అన్ని బాగా ఉడికిన తర్వాత నిమ్మరసం కూడా వేసి పొయ్యి నుంచి దింపేయాలి.
- Step 9
రెడీ చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసి బాగా కలిపి చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి.