- Step 1
బంగాళాదుంపలు కడిగి నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
- Step 2
బాగా మెత్తగా ఉడికిన తరువాత తొక్కలు వొలిచి మెత్తగా రుబ్బాలి.
- Step 3
ఈ రుబ్బిన ముద్దను ఒక గరిటె నెయ్యి వేసి ఉంచుకోవాలి.
- Step 4
వేయించిన దుంపల ముద్దలో పాలకోవాను ముందుగా తయారుచేసి ఉంచుకోవాలి.
- Step 5
వేయించిన దుంపల ముద్దలో పాలకోవా వేసి కలిపి ఉంచుకోవాలి.
- Step 6
ఒక గిన్నెలో పంచదార వేసి, నీళ్లు కొద్దిగా పోసి తీగపాకం వచ్చే వరకు స్టవ్‌మీద ఉంచి, తరువాత రెండూ కలిపి ఉంచుకున్న ముద్దను ఆ పాకంలో వేసి బాగా కలుపుకోవాలి.
- Step 7
ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా వేసి బాగా కలిపి, యాలకులపొడి, పచ్చకర్పూరం కూడా వేసి బాగా కలపాలి.
- Step 8
మూత ఉంచి అరగంట తరువాత తియ్యాలి. ఇది చాలా బాగుంటుంది. వెరైటీగా కూడా ఉంటుంది.