- Step 1
ఒక మూకుడులో నెయ్యి వేసి బాస్మతి బియ్యాన్ని సువాసన వచ్చేలా వేగించాలి.
- Step 2
అది చల్లబడిన తర్వాత మిక్సీలో వేసి రవ్వగా ఆడుకోవాలి.
- Step 3
మందపాటి అడుగున్న గిన్నెగానీ, కుక్కర్‌గానీ పొయ్యి మీద పెట్టి దానిలో పాలు పోసి బియ్యపు రవ్వ కలపాలి.
- Step 4
దీనిలో ఒక పొడుగైన గరిట పెడితే పాలు పొంగకుండా ఉంటాయి.
- Step 5
సన్నటి మంట పెట్టి ఈ గిన్నె మీద మూత పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత వెయిట్ పెట్టాలి.
- Step 6
ఒక విజిల్ వచ్చాక మంట తక్కువ చెయ్యాలి.
- Step 7
అలా అరగంట ఉడికిన తర్వాత గ్యాస్ స్టవ్ కట్టేసి, చల్లారాక ఈ పాయసానికి పంచదార కలపాలి.
- Step 8
వేరే గిన్నెలోకి తీసుకుని కుంకుమపువ్వుతో అలంకరించాలి.