- Step 1
శనగపిండిని జల్లించి, పలుచగా బూందీ పిండిలాగా కలుపుకోవాలి.
- Step 2
నెయ్యి లేదా నూనెను వెడల్పాటి బాణలిలో పోసి వేడిచేసి, అందులో బూందీ చట్రం సహాయంతో శనగపిండిని వేసి బూందీని చేసుకోవాలి.
- Step 3
పొయ్యిమీద ఒక పాత్రలో మూడొంతుల చక్కెరను, తగినంత నీటిని పోసి పాకం పట్టి, లేత పాకం రాగానే వేయించిన బూందీని అందులో వేసి కలియదిప్పి పక్కన ఉంచుకోవాలి.
- Step 4
మిగిలిన చక్కెరను కోవాలో వేసి పొయ్యిమీద పెట్టాలి.
- Step 5
దానిని కలియదిప్పుతూ... యాలక్కాయల పొడి, జీడిపప్పులు, బాదం, పిస్తా ముక్కలు కూడా కలుపుకోవాలి.
- Step 6
ఒక వెడల్పాటి పళ్లానికి నెయ్యి రాసి దానిమీద బూందీ, కోవా మిశ్రమాన్ని పరచాలి.
- Step 7
కాస్తంత ఆరిన తరువాత ఆ మిశ్రమాన్ని తీసుకుని లడ్డూల్లాగా చేసుకోవాలి అంతే..