- Step 1
గోధుమలు, బాదంపప్పులు రాత్రి నానబెట్టండి.
- Step 2
ఉదయం గోధుమల్లో కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయండి. దాంట్లో నీళ్లుపోసి పాలు తీయండి.
- Step 3
వాటిని పక్కకు పెట్టండి. పైన తేరుకున్న నీళ్లను వంపేయండి.
- Step 4
బాదంపప్పులపై తొక్క తీసివేసి మెత్తగా గ్రైండ్ చేయండి.
- Step 5
దాన్ని గోధుమపాలలో కలపండి. జీడిపప్పులను కొంచెం నేతిలో వేయించి పక్కకు పెట్టండి.
- Step 6
బాణలిలో పంచదారను వేసి, ఒక కప్పు నీళ్లు పోసి కరిగించండి.
- Step 7
కుంకుమ పువ్వు కూడా వేసి హల్వా గట్టిపడేవరకు ఉడికించాలి.
- Step 8
యాలకులపొడివేసి కలపండి. కొంచెం నెయ్యి వేయండి. ప్లేటుకు నెయ్యి రాసి హల్వా మిశ్రమాన్ని ప్లేటులో వేయండి.
- Step 9
చల్లారిన తర్వాత కావలసిన షేపులో ముక్కలు కోసి పైన జీడిపప్పులు అలంకరించండి.