- Step 1
కొబ్బరి, బెల్లం, యాలకుల పొడి, గసాలు కలిపి ఒక పాన్‌లో వేడిచేయాలి.
- Step 2
ఈ మిశ్రమం కాస్త ఉండకట్టే మాదిరి అయ్యే వరకూ ఉంచి దించాలి.
- Step 3
ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని వేడి చేయాలి. ఉప్పు, నెయ్యి వేసి మరిగిన తరువాత బియ్యంపిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతుండాలి.
- Step 4
తక్కువ మంటపైన పిండిని ఉడికించి తరువాత దీన్ని ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చాలి.
- Step 5
పిండిని నెయ్యి రాసుకున్న చేత్తో కలిపి చిన్న ఉండను తీసుకుని చిన్న బౌల్‌లాగా తయారుచేసి అందులో కొబ్బరి పాకాన్ని కొద్దిగా ఉంచి మూసివేసి గుండ్రంగా ఉండ్రాళ్లలా చుట్టాలి.
- Step 6
లేదా మీ కిష్టమైన ఆకృతుల్లో వీటిని చేసి తిరిగి ఒక గిన్నెలో పేర్చి కుక్కర్‌లో ఆవిరిపైన ఉడికించాలి.
- Step 7
వీటిని వేడిగానైనా లేదా చల్లారాక అయినా నేతిలో తింటే చాలా రుచిగా ఉంటాయి.