- Step 1
ముందుగా స్టౌ మీద పాన్ ఉంచి, అందులో రెండుస్పూన్ల నెయ్యి వేయాలి.
- Step 2
అది వేడెక్కాక జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తాల్ని దోరగా వేపుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఆ తర్వాత మరో స్పూన్ నెయ్యి వేయాలి.
- Step 4
అది వేడెక్కాక గుమ్మడి, క్యారెట్ తురుముల్ని వేర్వేరుగా వేయించి, పక్కన పెట్టుకోవాలి.
- Step 5
ఆ తర్వాత పాన్‌లో పాలు, పంచదార వేసి దగ్గరపడే వరకూ ఉడికించాలి.
- Step 6
అందులో ముందుగా వేయించి పెట్టుకున్న గుమ్మడి, క్యారెట్ తురుముల్ని వేయాలి.
- Step 7
ఆ తర్వాత మిగిలిన నెయ్యి వేసి గరిటెతో చిక్కపడే వరకూ తిప్పుతూ ఉండాలి.
- Step 8
బాగా దగ్గరపడే ముందు యాలకుల పొడి కూడా వేసి కలపాలి.
- Step 9
దగ్గరపడ్డాక స్టౌ మీద నుండి దించేసి ఒక ప్లేట్‌కి నెయ్యి రాసి అందులోకి ఈ పదార్థాన్ని తీసుకోవాలి.
- Step 10
దీనిపైన ముందుగానే వేయించిన జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తాల్ని చల్లాలి.
- Step 11
అంతే గుమ్మడి, క్యారెట్ హల్వా రెడీ. దీన్ని ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. లేదా బౌల్స్‌లోకి విడిగా వడ్డించీ ఇవ్వొచ్చు.