- Step 1
వెడల్పాటి అడుగు మందమున్న గిన్నెను స్టౌపై ఉంచి చెంచా నెయ్యి వేయాలి.
- Step 2
నెయ్యి వేడెక్కాక జీడిపప్పు, బాదాం, కిస్మిస్ దోరగా వేయించి పక్కన పెట్టు కోవాలి.
- Step 3
అదే గిన్నెలో బొంబాయిరవ్వ వేసి కమ్మటి వాసన వచ్చేవరకూ వేయించాలి.
- Step 4
వేయించిన రవ్వను కూడా విడిగా తీసిపెట్టాలి. ఇప్పుడు గిన్నెలో ఒకటికి మూడొం తుల నీళ్లు పోసి, మరగించాలి.
- Step 5
హల్వా బాగా గట్టిగా కావాలంటే నీళ్లు ఒకటికి రెండే పోయవచ్చు. మరిగే నీళ్లల్లో పంచాదార, మిఠాయిరంగు వేసి కలపాలి.
- Step 6
పంచదార కరిగాక, రవ్వను పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరపడ్డాక యాలకుల పొడి వేసి కలపాలి.
- Step 7
చివరిలో మిగిలిన నెయ్యీ వేసి కలిపి, దించేయాలి.
- Step 8
దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని, ముందుగా వేయించి పెట్టుకున్న జీడి పప్పు, బాదం, కిస్మిస్‌లతో గార్నిష్ చేసుకోవాలి.
- Step 9
అంతే ఎంతో రుచికరమైన రవ్వకేసరి రెడీ.