- Step 1
కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఆకులు అన్నీ కలిపి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి.
- Step 2
నాలుగు చికెన్ తొడలకు చాకుతో లోతుగా గంట్లు పెట్టి వెనిగర్ ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్దని బాగా పట్టించి పావుగంటసేపు నానబెట్టుకోవాలి.
- Step 3
పెరుగు బాగా చిలికి ఉప్పు, గరం మసాలా పొడి, నూనె వేసి బాగా డైల్యూట్ చేసి చికెన్ ముక్కలను అందులో వేసి ఆరుగంటలపాటు ఊరనివ్వాలి..
- Step 4
తరువాత చికెన్ ముక్కల్ని బొగ్గుల సెగమీద దోరగా కాల్చాలి.
- Step 5
ఆపై వీటిని ఒక ప్లేటులో పెట్టి చాట్ మసాలా పొడి చల్లి, ఉల్లిపాయ చక్రాలూ నిమ్మ డిప్పలతో అందంగా అలంకరించి అతిథులకు వడ్డించాలి.
- Step 6
ఈ చికెన్ కబాబ్‌లను వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.